Thursday 8 November 2012

marugu dhoddi kattu mallanna...

మ‌రుగు దొడ్డి క‌ట్టు మ‌ల్లన్నా


 మ‌రుగు దొడ్డి క‌ట్టు మ‌ల్లన్నా ఓ మ‌ల్లన్నా 
నువ్ రేపుమాప‌న‌కే రాజ‌న్నా ఓ మాయ‌న్న 

చ 1: ర‌ంగుల టీవీ కావాలంటివి
ఊప‌రు మూజిక్ రావాలంటివి
వంద‌ల ఛాన‌ళ్లు చూస్తానంటివి
స‌న్ డైరెక్టూ కొన‌నే కొంటివి

ఇవ్వన్నింటికి పైస‌లుంట‌యి
మ‌రుగుదొడ్డికేమో లేపాయంటివి

సాకులు జెప్ప కు మ‌ల్లన్నా 
నీ సోకులు తెలియ‌వ రాజ‌న్నా                      '' మ‌రుగు దొడ్డి క‌ట్టు ''

చ‌2: కెమెరా ఫోనూ కావాలంటివి
ఎఫ్ ఎం పాట‌లు రావాలంటివి
అందులో..
ఇంట‌ర్నెట్టూ చూస్తానంటివి
ఆరునెల్లకో సెల్లుని గొంటివి 

ఇవ్వన్నింటికి పైస‌లుంట‌యి
మ‌రుగుదొడ్డికేమో లేపాయంటివి

సాకులు జెప్ప కు మ‌ల్లన్నా 
నీ సోకులు తెలియ‌వ రాజ‌న్నా                       '' మ‌రుగు దొడ్డి క‌ట్టు ''       

చ 3 : బోరుగొడుతుందాని బీరు దాగితివి
బారుకెళ్లుడూ గొప్పనుకుంటివి
బాగ తాగింన‌క బ‌ట్ట లిడిసేత్తివి
త‌న్నులు ప‌డితివి దండుగులు గ‌డితివి

ఇవ్వన్నింటికి పైస‌లుంట‌యి
మ‌రుగుదొడ్డికేమో లేపాయంటివి

సాకులు జెప్ప కు మ‌ల్లన్నా 
నీ సోకులు తెలియ‌వ రాజ‌న్నా                 '' మ‌రుగు దొడ్డి క‌ట్టు ''   

చ 4: ఎదిగిన బిడ్డ ఇంటిలో ఉండే
ముంత‌వ‌ట్టుక‌పోను సిగ్గుప‌డుతుండే
చాత‌గాని ముస‌ల‌వ్వ బాధ‌ప‌డుతుండే
చావురాక‌పాయ‌ని ఎదురుచూస్తుండే

క‌న్న బిడ్డ బాధ క‌నిపించ లేదా      క‌నిపించ లేదా
క‌న్న త‌ల్లి గోడు వినిపించ లేదా      వినిపించ లేదా 

సాకులు జెప్ప కు మ‌ల్లన్నా 
నువ్ స‌క్క గాలోచించు రాజ‌న్నా                   '' మ‌రుగు దొడ్డి క‌ట్టు ''  

చ 5 : రోడ్డు మీద‌నే దొడ్డికి పోత‌వు
ఎవ‌రు వ‌చ్చినా సిగ్గు లేదంటావు
పందుల‌తో రోజు పోట్లాడుతుంటావు
ఈగ‌ల‌తో దోమ‌ల‌తో కొట్లాడుతుంటావు

కంపు వాస‌న నీకు ఇంపుగ‌ ఉందా       ఇంపుగ‌ ఉందా 
రోగాల రొంపి మంచిగ‌ ఉందా         మంచిగ‌ ఉందా 

సాకులు జెప్ప కు మ‌ల్లన్నా 
నువ్ స‌క్క గాలోచించు రాజ‌న్నా                  '' మ‌రుగు దొడ్డి క‌ట్టు ''  

- తిరుప‌తి పెద్ది,

( గ్రామాల్లో మ‌రుగుదొడ్ల ఆవ‌శ్య క‌త చెప్ప డానికి 02.10.2011 నాడు ఈ పాట‌ను రాశాను..)